మోదీకి ఝల్‌మురి అమ్మిన విక్రమ్ సావోకు బెదిరింపులు
ABN , Publish Date - May 23 , 2026 | 03:25 PM
ప్రధానమంత్రి మోదీ బెంగాల్ పర్యటనలో ఆయనకు ఝల్‌మురి అమ్మిన విక్రమ్ సావోకు తాజాగా అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదరింపులు వస్తున్నాయి. తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చినట్టు విక్రమ్ సావో శనివారంనాడు తెలిపారు.
కోల్‌కతా: విక్రమ్ సావో (Vikram Sao) పేరు ఇటీవల మారుమోగింది. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఝూర్‌గ్రామ్‌లో కొద్దిసేపు ఆగినప్పుడు స్థానిక దుకాణంలో ఝల్‌మురి (Jhalmuri)ని రుచిచూశారు. దుకాణదారు విక్రమ్ సావోకు పది రూపాయలు ఇచ్చి మసాల మరమరాలు తీసున్నారు. ప్రధాని రాకతో అక్కడకు చేరుకున్న వారితో ఆయన సరదా సంభాషణ చేస్తూ ఝల్‌మురిని పంచిపెట్టారు. ఆ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత విక్రమ్ సావోకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని విక్రమ్ సావో శనివారంనాడు తెలిపారు. వెంటనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, దీంతో పోలీసులు తనకు భద్రత కల్పించారని చెప్పారు.
మంత్రి దిలీప్ ఘోష్ వార్నింగ్
ఝార్‌గ్రామ్‌కు చెందిన ఝల్‌మురి విక్రేత విక్రమ్ సావోకు బెదిరింపులు వచ్చిన సమాచారంపై పశ్చిమబెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ స్పందించారు. ఇలాంటి ప్రయత్నాలతో దేశంలో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలను కఠినంగా తిప్పికొట్టాల్సి ఉంటుందని అన్నారు. కొందరు శాంంతికి విఘాతం కల్పించేందుకు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు. అయితే ఆరోజులు పోయాయని, ఇప్పుడున్నది తమ ప్రభుత్వమని, చాలా గట్టిగా స్పందిస్తామని చెప్పారు.
ప్రధానమంత్రి పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటన జరుపుతూ ఒక రోడ్డు పక్కన దుకాణం వద్ద ఆగి ఝల్‌మురి కొనుక్కుని తినడంపై దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్య జరిగింది. అయితే ప్రధాని ముందస్తుగా ప్లాన్ చేసుకునే ఆగారని, ఇదంతా ఒక డ్రామా అని టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో లబ్ధి పొందేందుకే ఆయన ఈపని చేసారని అన్నారు.
ఇవి కూడా చదవండి..
రాజౌరిలో ఎన్‌కౌంటర్, బలగాల ఉచ్చుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు
కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..