రాజౌరిలో ఎన్‌కౌంటర్, బలగాల ఉచ్చుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు
ABN , Publish Date - May 23 , 2026 | 02:42 PM
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా డొరిమల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారంనాడు ఎదురెదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం పోలీసుల సంయుక్త బృందం వలలో ఇద్దరు నుంచి ముగ్గురు పాక్ ఉగ్రవాదులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా డొరిమల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారంనాడు ఎదురెదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం పోలీసుల సంయుక్త బృందం వలలో ఇద్దరు నుంచి ముగ్గురు పాక్ ఉగ్రవాదులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మిలిటెంట్ల కోసం గాలింపు ఆపరేషన్ కొనసాగుతోంది.
టెర్రరిస్టుల సంచారంపై సమాచారం రావడంతో భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారని, ఇది గమనించిన టెర్రరిస్టులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని చెబుతున్నారు.
కాగా, కిష్ట్వార్ నుంచి టెర్రిరిస్ట్ నెట్‌వర్క్‌ను సమూలంగా నిర్మూలించినట్టు గత ఫిబ్రవరిలో ఇండియన్ ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ ప్రకటించారు. ఏడుగురు టెర్రరిస్టుల ఫోటోలను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. 326 రోజుల తర్వాత కిష్ట్వార్‌లోని టెర్రర్ నెట్‌ఫర్క్‌ను తుడిచివేశామని పేర్కొన్నారు. హతుల్లో కిష్ట్వార్ టెర్రర్ ఆపరేషన్ మాస్టర్‌మైండ్ జైషే కమాండర్ సైఫుల్లా కూడా ఉన్నాడు.
పాక్‌కు ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్
ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గత వారంలో ఇస్లామాబాద్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం, ఇండియాకు వ్యతిరేకంగా టెర్రర్ ఆపరేషన్లు నిర్వహించడం మానకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని, ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..
19వ రోజ్‌గార్ మేళా.. మోదీ చేతుల మీదుగా 51వేల మందికి నియామక పత్రాలు