Share News

భారత్‌కు చేరుకున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి

ABN , Publish Date - May 23 , 2026 | 09:52 AM

భారత పర్యటన కోసం బయలుదేరిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి నేడు కోల్‌కతాకు చేరుకున్నారు. త్వరలో ప్రధాని మోదీతో కూడా సమావేశం అవుతారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ వేదికగా తెలిపారు.

భారత్‌కు చేరుకున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి
Marco Rubio India Tour

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో నేడు కోల్‌కతాకు చేరుకున్నారు. నేటి నుంచీ నాలుగు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. 2012లో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత్‌లో పర్యటించారు. ఆ తరువాత దాదాపు 14 ఏళ్ల తరువాత మరోసారి యూఎస్ విదేశాంగ మంత్రి భారత్‌కు వచ్చారు. వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ రంగం, క్వాడ్ కూటమి తదితర విషయాలపై భారత్‌తో చర్చలు జరిపేందుకు మంత్రి రూబియో భారత్‌కు వచ్చారు.

మంత్రి రాక గురించి భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మంత్రి రూబియో త్వరలో ప్రధాని మోదీతో సమావేశమవుతారని కూడా చెప్పారు. యూఎస్-భారత్ భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన సాగుతుందని అన్నారు. కోల్‌కతాలో మంత్రి రూబియో మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించనున్నారు. అనంతరం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ నగరాలను కూడా సందర్శిస్తారు.


ఇంధన రంగంలో సహకారం, క్వాడ్ కూటమి బలోపేతం దిశగా అమెరికా మంత్రి చేపడుతున్న ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. భారత్‌కు బయలుదేరే ముందు మంత్రి రూబియో మీడియాతో మాట్లాడారు. భారత్‌కు అమెరికా ఇంధన ఎగుమతులు పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. క్వాడ్ కూటమి దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం మే 26న జరగనుంది. ఈ సమావేశంలో యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్, భారత దేశ విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కానున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

టీవీ షో వ్యాఖ్యాతను ఎత్తి చెత్తబుట్టలో వేసి.. ట్రంప్ మరో వీడియో వైరల్

గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్నారా?..అమెరికాను వీడండి

Updated Date - May 23 , 2026 | 10:00 AM