Share News

పట్టాలు తప్పిన వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు.. ప్రయాణికులు క్షేమం

ABN , Publish Date - Apr 27 , 2026 | 09:13 PM

ముంబై-షోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పుణె స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా సోమవారం సాయంత్రం 7.30 గంటలకు ప్రమాదానికి గురైంది. డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక కోచ్ ట్రాలీ పట్టాలు తప్పింది.

పట్టాలు తప్పిన వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు.. ప్రయాణికులు క్షేమం
Vande Baharat Express train

పుణె: ముంబై-షోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పుణె స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా సోమవారం సాయంత్రం 7.30 గంటలకు ప్రమాదానికి గురైంది. డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక కోచ్ ట్రాలీ పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.


డైమండ్ క్రాసింగ్ వద్ద పుణే రైల్వే స్టేషన్ యార్డ్ రీమోడలింగ్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ప్రయాణికుల సౌకర్యార్థం వారిని వేరే బోగీలోకి తరలించామని సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ తెలిపారు. ఈ ఘటన కారణంగా పుణే మార్గంలో వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రైస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వందే భారత్ రైలు పట్టాలు తప్పడం ఇదే మొదటిసారని, 2019-2026 మధ్య తొలిసారి ఈ తరహా ఘటన జరిగిందని చెబుతున్నారు. వందేభారత్ రైళ్లకు ఇంతవరకూ అత్యంత సురక్షితమైన రైలుగా పేరుంది. ఈ రైళ్లలో కవచ్ సిస్టం ఏర్పాటు ఉంది.


ఇవి కూడా చదవండి..

బీజేపీ సీఎం ప్రమాణస్వీకారాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.. బెంగాల్ ప్రజలకు మోదీ లేఖ

అవినీతిలో ఇద్దరూ ఇద్దరే : రాహుల్ గాంధీ

Updated Date - Apr 27 , 2026 | 09:30 PM