బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్
ABN , Publish Date - Apr 27 , 2026 | 08:13 PM
పశ్చిమబెంగాల్‌లో రెండో విడత పోలింగ్ స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ కీలక నియామకం జరిపింది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో రెండో విడత పోలింగ్ స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ కీలక నియామకం జరిపింది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. కోల్‌కతాతో సహా దక్షిణ బెంగాల్‌లోని 142 నియోజకవర్గాల్లో ఈనెల 29న కీలకమైన రెండో విడత పోలింగ్ జరుగనుంది.
లూథియానాకు చెందిన అజయ్ పాల్ శర్మ ఉత్తరప్రదేశ్ ఐపీఎస్-2011 బ్యాచ్‌కు చెందిన అధికారి. పోలీసు శాఖలో అత్యంత సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన అనేక ఆపరేషన్లలో ఆయన పాల్గొన్నారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
బెంగాల్ రెండో విడత పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏడు జిల్లాలో 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. దీనికి అదనంగా 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను ఏర్పాటు చేసింది. రియల్ టైమ్ మానిటరింగ్ కోసం కెమెరాలతో కూడిన డ్రోన్‌లను సిద్ధం చేశారు. కోల్‌కతాలో అత్యధికంగా 273 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ఈ విడత 3 కోట్ల 64 లక్షల పైచిలుకు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 41 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ సీఎం ప్రమాణస్వీకారాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.. బెంగాల్ ప్రజలకు మోదీ లేఖ
అవినీతిలో ఇద్దరూ ఇద్దరే : రాహుల్ గాంధీ