Share News

అమెరికన్‌ మార్కెట్లు హైజంప్‌!

ABN , Publish Date - Nov 05 , 2026 | 07:00 AM

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘన విజయాన్ని సాధించడంతో ఆ దేశ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి

అమెరికన్‌ మార్కెట్లు హైజంప్‌!
stock exchange

న్యూఢిల్లీ, నవంబరు 4: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘన విజయాన్ని సాధించడంతో ఆ దేశ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. డోజోన్స్‌ ఒక దశలో 1,500 పాయింట్లకు (2.9 శాతం) పైగా ఎగబాకగా.. ఎస్‌ అండ్‌ పీ సూచీ 1.86 శాతం, నాస్‌డాక్‌ 2.1 శాతం పుంజుకున్నాయి. గడిచిన కొన్నేళ్లలో ట్రంప్‌ అనుసరించిన విధానాలతో అంతర్జాతీయంగా పెరిగిన వాణిజ్య అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇక తగ్గుముఖం పట్టవచ్చన్న ఆశాభావమే ఇందుకు కారణమని ఈక్విటీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇటు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర 100 డాలర్ల దిగువకు పడిపోయింది. బ్రెంట్‌ ముడిచమురు పీపా ధర ఒక దశలో 9 శాతానికి పైగా తగ్గి 93 డాలర్లకు పడిపోయింది. కాగా, ఎన్నికల ఫలితాలతో ఎలాన్‌ మస్క్‌కు చెందిన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా షేరు ఒక దశలో 3 శాతం క్షీణించగా.. స్పేస్‌ఎక్స్‌ స్టాక్‌ 3.81 శాతం పతనమైంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మీ కుమార్తె సుప్రియ సిద్ధంగా ఉన్నారు.. శరద్ పవార్‌తో ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ!

ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. మేము కూడా అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు..

Updated Date - Nov 05 , 2026 | 07:12 AM