Share News

ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. మేము కూడా అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు..

ABN , Publish Date - Nov 04 , 2026 | 08:34 PM

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంపై భార‌త్‌ నేతలు కూడా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అమెరికాలో డెమోక్రాట్‌ల విజయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొత్త ఆశలకు చిగురింపచేస్తోంది.

ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. మేము కూడా అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు..
Congress Party

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంపై భార‌త్‌ నేతలు కూడా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అమెరికాలో డెమోక్రాట్‌ల విజయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొత్త ఆశలకు చిగురింపచేస్తోంది. భారత్‌లోనూ రాజకీయ మార్పు సాధ్యమేనని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'యెస్.. వి కెన్ టూ' (అవును.. మనం కూడా సాధించగలం) అంటూ కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా ఉన్నారు (Donald Trump Midterm Loss).


2026 నవంబర్ 3న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్‌లు ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందిస్తూ.. అమెరికాలో తాజాగా వచ్చిన మధ్యంతర ఎన్నికల ఫలితాలను ట్రంప్‌నకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుగా అభివర్ణించారు. భారత్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 'ఒకే దేశం.. ఒకే ఎన్నిక' విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే ప్రభుత్వాలను మధ్యలో ప్రశ్నించే అవకాశం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు (US Midterm Elections 2026).


కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శామా మహమ్మద్ అమెరికా ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. భారత్‌లోనూ ఇలాంటి రాజకీయ మార్పు త్వరలోనే వస్తుందని వ్యాఖ్యానించారు (Indian Politics). ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే, ఆర్థిక పరిస్థితులపై తప్పుడు ప్రచారం చేసే ప్రభుత్వాలకు ప్రజలు ఎన్నికల్లో తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. అసాధ్యమనుకున్న విజయాలు కూడా ప్రజల మద్దతుతో సాధ్యమవుతాయని వ్యాఖ్యానించారు. 'ఇండియా విల్ సూన్ ఫాలో' (భారత్‌లోనూ త్వరలో ఇదే జరుగుతుంది) అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..


అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి..

Updated Date - Nov 04 , 2026 | 08:40 PM