Share News

ఉత్తర్ ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో గ్రాండ్ సక్సెస్!

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:52 PM

ఉత్తర్‌ ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో వేదికగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కీలక అడుగు పడింది. ఐదు ప్రముఖ సంస్థలకు రూ. 469 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు స్థల కేటాయింపు పత్రాలు అందించారు.

ఉత్తర్ ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో గ్రాండ్ సక్సెస్!
UPITS 2026: Rs.469 Crore Investment to Create 4,625 Jobs in UP

ఢిల్లీ, సెప్టెంబర్ 26: ఉత్తర్ ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (UPITS) 2026 వేదికగా యూపీ పారిశ్రామికాభివృద్ధికి కీలక అడుగు పడింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) పరిధిలో వివిధ రంగాలకు చెందిన ఐదు ప్రముఖ సంస్థలకు రూ. 469 కోట్ల అంచనా వ్యయంతో పారిశ్రామిక ప్రాజెక్టుల ఏర్పాటుకు స్థల కేటాయింపు పత్రాలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అందించారు.


ఈ కేటాయింపుల ద్వారా YEIDA ప్రాంతంలో మొత్తం 71,190 చదరపు మీటర్ల భూమిని కేటాయించారు. ఈ ఐదు ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం ద్వారా దాదాపు 4,625 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కేవలం పెట్టుబడి ప్రతిపాదనల స్థాయిలోనే కాకుండా, వాటిని నేరుగా క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఈ కార్యక్రమం బాటలు వేసింది.


కేటాయింపు పత్రాల అందజేత అనంతరం పారిశ్రామికవేత్తలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖాముఖి మాట్లాడారు. ఉత్తర్ ప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాన్ని వేగవంతం చేయడం, స్థానిక తయారీ శక్తిని పెంచడం, సరఫరా గొలుసును బలోపేతం చేయడంపై ఆయన చర్చించారు. ప్రతిపాదించిన ప్రాజెక్టులు త్వరగా ఉత్పత్తి దశకు చేరుకునేలా పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను అమిత్ షా కోరారు.


భూమి పొందిన సంస్థల్లో సీ అండ్ ఆర్ టెక్స్‌టైల్స్, పర్ఫెక్ట్‌ప్యాక్ లిమిటెడ్, SABS ఎక్స్‌పోర్ట్స్ ఇంటర్నేషనల్, సింప్లాస్ట్ ఇండియా, సాహు ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి.


ఈ వార్తలూ చదవండి

సంఘ సంస్కరణలపై దృష్టి పెట్టండి

సార్.. నోరు తెరవండి.. డీఎంకే అధినేత స్టాలిన్‌‌పై సీఎం విజయ్ ఫైర్

Updated Date - Sep 26 , 2026 | 03:24 PM