Share News

రోడ్లపై నమాజ్‌లు వద్దు, ముస్లింలు జనాభా నియంత్రించుకోవాలి.. యోగి ఆదిత్యనాథ్

ABN , Publish Date - May 18 , 2026 | 05:50 PM

రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేని లఖ్‌నవూలో సోమవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.

రోడ్లపై నమాజ్‌లు వద్దు, ముస్లింలు జనాభా నియంత్రించుకోవాలి.. యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath

లఖ్‌నవూ: రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కీలక హెచ్చరికలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేని లఖ్‌నవూలో సోమవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. 'రోడ్లున్నవి ప్రజల రాకపోకల కోసం. వారికి అసౌకర్యం కలిగిస్తే ఊరుకోం. ముస్లింలు జనాభాను నియంత్రించుకోవాలి' అని అన్నారు.


'ఉత్తర్‌ప్రదేశ్‌లోని రోడ్లపై నమాజ్‌లు చేయరా అని తరచూ కొందరు నన్ను అడుగుతుంటారు. అలాంటివి ఇక్కడుండవని చెబుతుంటాను. కావాలంటే వెళ్లి చూసుకోమంటాను. రోడ్లున్నవి ప్రజా రవాణా కోసం. ఎవరైనా రోడ్ల కూడళ్ల వద్దకు వచ్చి ట్రాఫిక్‌ను దిగ్బంధించవచ్చా? ప్రజారవాణాకు అంతరాయం కలిగించే హక్కు వారికి ఎవరిచ్చారు?. మరికొందరు అడుగుతుంటారు. తాము ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా నమాజ్ చేయకుండా ఉండటం సాధ్యం కాదు కదా అంటారు. దానికి మా సమాధానం ఒక్కటే. మసీదుల్లో షిప్టుల ప్రకారం నమాజ్ చేసుకోండి. ఇంట్లో జాగా లేకుంటే దానికి తగ్గట్టుగా జనాభా ఉండేలా చూసుకోండి. జనాభాను పెంచుకోకండి. చట్టం అందరికీ సమానమే. ప్రభుత్వ నిబంధనలు కూడా చట్టంతో సమానం' అని యోగి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పోస్ట్ చేశారు.


ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా యోగి ఆదిత్యనాథ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్‌లను మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం అనుమతించడాన్ని తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యలను టీఎంసీ తోసిపుచ్చింది. మైనారిటీలను యోగి ఆదిత్యనాథ్ బెదిరిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది.


ఇవి కూడా చదవండి..

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

Updated Date - May 18 , 2026 | 06:08 PM