Share News

సనాతన ధర్మంపై మరోసారి ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన బీజేపీ..

ABN , Publish Date - May 12 , 2026 | 06:18 PM

తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితం ఉదయనిధి సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ దానిని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు.

సనాతన ధర్మంపై మరోసారి ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన బీజేపీ..
Udhayanidhi Stalin

తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితం ఉదయనిధి సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ దానిని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు కోర్టులలో పిటిషన్లు కూడా వేశారు (Udhayanidhi Stalin).


తాజాగా, మంగళవారం మధ్యాహ్నం తమిళనాడు అసెంబ్లీలో కూడా ఉదయనిధి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అసెంబ్లీ వేదికగా ప్రసంగించారు. అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా ఎన్నికైన జె.సి.డి. ప్రభాకర్‌ను అభినందిస్తూ చేసిన ప్రసంగంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్య చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసన్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఆయన మారలేదని విమర్శించారు. డీఎంకే నిజంగా ఇదే సిద్ధాంతాన్ని నమ్మితే ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు (Sanatana Dharma row).


'హిందూ మతాన్ని నిర్మూలించడమే ఉదయనిధి స్టాలిన్, డీఎంకేల విధానమైతే, దానిని వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు ప్రస్తావించలేదు? ( BJP vs DMK) ఎన్నికల ప్రచార సమయంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం నిర్మూలన గురించి ఎందుకు మాట్లాడలేదు. ఎన్నికల ప్రచారం చివరి రోజున 'మేం హిందువులకు వ్యతిరేకం కాదు' అని స్టాలిన్ ఎందుకు చెప్పుకున్నారు' అని శ్రీనివాసన్ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

విద్యార్థుల కష్టాన్ని, కలలను బీజేపీ ప్రభుత్వం కాలరాసింది: రాహుల్ గాంధీ


ముళ్ల కంచెలకు భయపడం.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ..

Updated Date - May 12 , 2026 | 06:21 PM