Share News

పాకిస్థాన్‌లో ఇరాన్ యుద్ధ విమానాల పార్కింగ్.. పాక్ అధికారి స్పందన ఏంటంటే..

ABN , Publish Date - May 12 , 2026 | 04:30 PM

పశ్చిమాసియాలోని ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ యుద్ధ విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో నిలిపి ఉంచేందుకు పాకిస్థాన్ అనుమతినిచ్చిందని అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు సంచలనం రేకెత్తించాయి. ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక యుద్ధ విమానాలు రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లో నిలిపి ఉంచినట్టు కథనాలు వెలువడ్డాయి.

పాకిస్థాన్‌లో ఇరాన్ యుద్ధ విమానాల పార్కింగ్.. పాక్ అధికారి స్పందన ఏంటంటే..
Iranian fighter jets in Pak

పశ్చిమాసియాలోని ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ యుద్ధ విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో నిలిపి ఉంచేందుకు పాకిస్థాన్ అనుమతినిచ్చిందని అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు సంచలనం రేకెత్తించాయి. ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక యుద్ధ విమానాలు రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లో నిలిపి ఉంచినట్టు కథనాలు వెలువడ్డాయి. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక ఆస్తులను రక్షించుకోవడం కోసం ఇరాన్, పాక్ సహాయం కోరిందని ఆ కథనాలు పేర్కొన్నాయి (Pakistan Iran news).


ఈ వార్తలపై పాక్ సైన్యానికి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవాలని కొట్టిపడేశారు. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ రావల్పిండిలోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉందని, అలాంటి చోట రహస్య కార్యకలాపాలు జరగడం అసాధ్యమని తేల్చి చెప్పారు. శాంతి చర్చల కోసం ఇరాన్ ప్రతినిధులు వచ్చిన యుద్ధ విమానం మాత్రమే పాకిస్థాన్‌లో పార్కింగ్ చేసి ఉందని స్పష్టం చేశారు (Iranian fighter jets).


పాకిస్థాన్‌లో ఇరాన్ విమానాలను రహస్యంగా పార్క్ చేసి ఉంచారనే వార్తలపై అమెరికాకు చెందిన సెనెటర్ లిండ్సే గ్రాహం స్పందించారు (Pakistan statement). ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాక్‌ను తప్పక అనుమానించాల్సిందేనని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

విద్యార్థుల కష్టాన్ని, కలలను బీజేపీ ప్రభుత్వం కాలరాసింది: రాహుల్ గాంధీ


ముళ్ల కంచెలకు భయపడం.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ..

Updated Date - May 12 , 2026 | 04:30 PM