Share News

రెండో రోజూ భారీ నష్టాలే.. సెన్సెక్స్ 1450 పాయింట్లు డౌన్..

ABN , Publish Date - May 12 , 2026 | 04:00 PM

అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశీయ సూచీలపై వరుసగా రెండో రోజు కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 2.4 శాతం పెరిగి 106.75 డాలర్లకు చేరుకుంది. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం కూడా అందోళన కలిగిస్తోంది.

రెండో రోజూ భారీ నష్టాలే.. సెన్సెక్స్ 1450 పాయింట్లు డౌన్..
Indian stock market

అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశీయ సూచీలపై వరుసగా రెండో రోజు కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 2.4 శాతం పెరిగి 106.75 డాలర్లకు చేరుకుంది. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం కూడా అందోళన కలిగిస్తోంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రద్దు కావొచ్చని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు (Indian stock market).


మరోవైపు ఏఐ స్టార్టప్ కంపెనీ అయిన ఓపెన్ ఏఐ 'ఓపెన్ ఏఐ డిప్లాయ్‌మెంట్ కంపెనీ'ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం ఐటీ సెక్టార్‌కు షాకిచ్చింది. ఐటీ సెక్టార్‌ 3 శాతానికి పైగా నష్టపోయింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.63) మరింతగా పతనమైంది. ఇన్ని ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాలను చవిచూశాయి.


గత సెషన్ ముగింపు (76,015)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 1456 పాయింట్ల నష్టంతో 74,559 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 436 పాయింట్ల నష్టంతో 23,379 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ, బయోకాన్, వేదాంత, హిందుస్థాన్ జింక్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). కేన్స్ టెక్నాలజీస్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, యూపీఎల్, కల్యాణ్ జువెల్లర్స్, డిక్సన్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 884 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1553 పాయింట్లు నష్టపోయింది.


ఇవి కూడా చదవండి..

విద్యార్థుల కష్టాన్ని, కలలను బీజేపీ ప్రభుత్వం కాలరాసింది: రాహుల్ గాంధీ


ముళ్ల కంచెలకు భయపడం.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ..

Updated Date - May 12 , 2026 | 04:00 PM