విద్యార్థుల కష్టాన్ని, కలలను బీజేపీ ప్రభుత్వం కాలరాసింది: రాహుల్ గాంధీ
ABN , Publish Date - May 12 , 2026 | 03:33 PM
ప్రశ్నాపత్రం లీక్ కారణంగా నీట్ పరీక్ష రద్దు కావడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని లక్షల మంది కష్టాన్ని, కలల్ని బీజేపీ ప్రభుత్వం ఛిద్రం చేసిందని విమర్శించారు. ఇది పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదని, యువత భవిష్యత్తును కాలరాసే నేరమని ఆరోపించారు.
ప్రశ్నాపత్రం లీక్ కారణంగా నీట్ పరీక్ష రద్దు కావడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని లక్షల మంది కష్టాన్ని, కలల్ని బీజేపీ ప్రభుత్వం ఛిద్రం చేసిందని విమర్శించారు. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదని, యువత భవిష్యత్తును కాలరాసే నేరమని ఆరోపించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు (NEET 2026 cancelled).
దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల త్యాగాలు, ఎన్నో కుటుంబాల ఆశలు ఈ అవినీతి పాలన వల్ల నాశనమయ్యాయని రాహుల్ గాంధీ అన్నారు. కొంతమంది తండ్రులు అప్పులు చేశారని, తల్లులు తమ నగలు అమ్మారని, లక్షలాది మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివారని, అయితే పేపర్ లీకులు, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యా వ్యవస్థలో అవినీతి వారికి శాపంలా మారాయని విమర్శించారు. ప్రతిసారి పేపర్ మాఫియా తప్పించుకుంటోందని, నిజాయతీగా చదివిన విద్యార్థులే శిక్ష అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు (NEET paper leak).
'కష్టం కాదు.. డబ్బు, పరిచయాలే భవిష్యత్తును నిర్ణయిస్తే విద్యకు అర్థమేంటి? ప్రధాని చెప్పే అమృత కాలం దేశ యువతకు విష కాలంగా మారింది' అని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు (Medical entrance exam). విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఇంద్రకీలాద్రిపై వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు