అసెంబ్లీ సాక్షిగా.. సనాతన ధర్మంపై ఉదయనిధి మళ్లీ అవే వ్యాఖ్యలు
ABN , Publish Date - May 12 , 2026 | 03:05 PM
సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో గతంలో విమర్శలు ఎదుర్కొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మంగళవారంనాడు కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విడదీసే సనాతన ధర్మాన్ని రూపుమాపాలని అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు.
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో గతంలో విమర్శలు ఎదుర్కొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మంగళవారంనాడు కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విడదీసే సనాతన ధర్మాన్ని రూపుమాపాలని అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు.
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంలో 'తమిళ్ తాయ్ వాల్తు'ను చివర్లో ఆలపించడంపై ఉదయనిధి స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత వందేమాతరం, ఆ తర్వాత జాతీయగీతం ఆలపించి, చివర్లో తమిళ్ తాయ్ ఆలపించారని అన్నారు. రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందే ఆలపించాలని, దానిని వెనక్కి నెట్టడం సరికాదని అన్నారు. మరోసారి ఇలా జరక్కుండా ప్రభుత్వం చూసుకోవాలని సూచించారు. పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంలో వందేమాతరం అసలు ఆలపించలేదని, అక్కడి గవర్నర్ ఎవరో అందరికీ తెలుసునని అన్నారు.
ఒకే కాలేజీలో చదువుకున్నాం..
విజయ్, తాను ఒకే కాలేజీలో చదువుకున్నామని, పరిపాలన విషయంలో డీఎంకే సీనియర్ అని, తమ అనుభవాలను, సూచలను సీఎం విజయ్ స్వీకరించాలని సూచించారు. విజయ్ తమ నేతను, ఇతర పార్టీల నేతలను కలుసుకున్నారని, అసెంబ్లీలోనూ ఇదే తరహా రాజకీయ మర్యాద కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. సభలో అధికార, విపక్షాలు వేర్వేరుగా కూర్చున్నప్పటికీ అంతా కలిసికట్టుగా తమిళనాడు అభివృద్ధికి కృషిచేయాల్సి ఉంటుందన్నారు. తమిళనాడు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ గత సోమవారంనాడు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 59 స్థానాల్లో గెలిచిన డీఎంకే ప్రస్తుత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.
ఇవి కూడా చదవండి..
అన్నాడీఎంకేలో తిరుగుబాటు.. విజయ్ టీవీకేకు షణ్ముగం వర్గం మద్దతు
సీఎం విజయ్ మాస్ క్రేజ్.. ఆ పేజ్‌కు 4 లక్షల నుంచి 22 లక్షలకు పెరిగిన ఫాలోవర్స్..