ద్రోహులనే కలుస్తారా.. విద్యార్థులను కలవరా: ప్రధానిపై ఉద్ధవ్ విమర్శలు..
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:53 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలు చేస్తున్న యువతను కలవడానికి ప్రధానమంత్రికి సమయం ఉండటం లేదని, కానీ తమ పార్టీని వీడి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన ఎంపీలను కలవడానికి మాత్రం సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలు చేస్తున్న యువతను కలవడానికి ప్రధానమంత్రికి సమయం ఉండటం లేదని, కానీ తమ పార్టీని వీడి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన ఎంపీలను కలవడానికి మాత్రం సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. ముంబైలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు (Uddhav Thackeray, PM Modi).
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన తమ పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలను ఇటీవల ప్రధానమంత్రి మోదీ కలవడంపై ఉద్ధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రధానమంత్రికి యువతను కలిసేందుకు సమయం లేదు. కానీ తిరుగుబాటుదారులను కలవడానికి సమయం ఉంది' అంటూ ఉద్ధవ్ విమర్శించారు (Modi Uddhav row).
షిండే నేతృత్వంలోని శివసేనకు ‘అసలైన శివసేన’గా గుర్తింపు ఇచ్చిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ తమ వర్గం దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సమయంలో ఈ భేటీ ఎందుకు జరిగిందని ఉద్ధవ్ ప్రశ్నించారు (Maharashtra politics). సుప్రీంకోర్టుపై ఒత్తిడి తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఈ భేటీనా అని ఆయన ప్రశ్నించారు. శివసేనలో చీలిక తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఇటీవల ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది.
ఇవి కూడా చదవండి..
యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్
డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం..