జల్లికట్టులో విషాదం.. ఎద్దు పొడిచి ముగ్గురి మృతి..
ABN , Publish Date - Mar 02 , 2026 | 06:57 PM
శివగంగై జిల్లాలో ఏర్పాటు చేసిన జల్లికట్టులో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం జరిగిన ఈ క్రీడలో ఎద్దు పొడవడంతో ముగ్గురు మరణించారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
తమిళనాడు, మార్చి 02: శివగంగై జిల్లాలో ఏర్పాటు చేసిన జల్లికట్టులో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం జరిగిన ఈ క్రీడలో ఎద్దు పొడవడంతో ముగ్గురు మరణించారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో వారందరినీ పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జల్లికట్టు సందర్భంగా సరైన భద్రతా చర్యలు చేపట్టలేదని.. అందువల్లే ఇలా జరిగిందంటూ స్థానికులతో పాటు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
మరో వైపు ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. తమిళనాడులో జల్లికట్టు పోటీలను సంప్రదాయ క్రీడగా ప్రజలు జరుపుకొంటారు. ఈ క్రీడలను చూసేందుకు ఏపీ, తెలంగాణ ప్రజలు భారీగా తమిళనాడుకు తరలివస్తారు. పరుగులు తీస్తున్న పశువులను పట్టుకోవడానికి యువకులు ఉత్సాహంగా పోటీపడి పరుగెడతారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రగ్రహణం.. హోలీ పండగ ఎప్పుడు..?
గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి
For More National News And Telugu News