Share News

విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా విజయ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:57 PM

తమిళనాడులో విద్యార్థులు రాజకీయ నిరసనలు, ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా విజయ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు
Tamil Nadu students political protests

చెన్నై, ఆగస్టు 19: తమిళనాడులో విద్యార్థులు, యువత రాజకీయ నిరసనలు, ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, పోలీస్ శాఖతో పాటు జిల్లా యంత్రాంగాలు అన్నీ సమన్వయంతో తగిన నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టే కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి. విద్యార్థులు ఎటువంటి రాజకీయ నిరసన కార్యక్రమాలలో పాల్గొనకుండా విజయ్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. రాజకీయ ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (DCE) సంబంధిత శాఖలను ప్రభుత్వం కోరింది.


అధికారులు అందరూ సమన్వయంతో వ్యవహరించి, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలని సూచించింది. అంతేకాకుండా, ఈ విషయమై ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై వివరాలతో కూడిన నివేదికలను సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టేలా చూస్తూ, వారిని రాజకీయ పార్టీల ఆందోళనల నుంచి కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 01:01 PM