Share News

భారత్‌లో పనిచేసేప్పుడుఇక్కడి రూల్సే పాటించాలి

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:50 AM

ఏదైనా ఖాతాను బ్లాక్‌ చేస్తే.. ఎవరి అభ్యర్థన మేరకు, ఏ చట్టపరమైన కారణాల వల్ల ఆ ఖాతాను తొలగించారు అనే వివరాలను యూజర్లకు వెల్లడించేలా ఎక్స్‌ తీసుకువచ్చిన కొత్త...

భారత్‌లో పనిచేసేప్పుడుఇక్కడి రూల్సే పాటించాలి

  • మెటా, ఎక్స్‌లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఏదైనా ఖాతాను బ్లాక్‌ చేస్తే.. ఎవరి అభ్యర్థన మేరకు, ఏ చట్టపరమైన కారణాల వల్ల ఆ ఖాతాను తొలగించారు అనే వివరాలను యూజర్లకు వెల్లడించేలా ఎక్స్‌ తీసుకువచ్చిన కొత్త నిబంధనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఏ సోషల్‌ మీడియా సంస్థ అయినా సరే, భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పుడు ఇక్కడి చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది. మరోవైపు, ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ వ్యాప్తిపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఎలాంటి కంటెంట్‌నూ సహించేది లేదని మెటా సంస్థకు తేల్చి చెప్పింది. బాలల లైంగిక వేధింపుల మెటీరియల్‌(సీఎ్‌సఏఎం) వ్యాప్తికి కారణమయ్యే సోషల్‌ మీడియా వేదికలతో పాటు వ్యక్తులు చట్టపరమైన రక్షణ కోల్పోతారని హెచ్చరించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 06:50 AM