Share News

బిహార్‌లో బాలికకు లైంగిక వేధింపులు.. ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:34 PM

బిహార్‌లోని జాముయ్‌లో టెన్త్ క్లాస్ చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. బాలికతో పాటు ఆమె స్నేహితుడిని కూడా దుండగులు వేధించారు.

బిహార్‌లో బాలికకు లైంగిక వేధింపులు.. ముగ్గురి అరెస్టు

ఇంటర్‌నెట్ డెస్క్: బిహార్‌లోని జాముయ్‌లో టెన్త్ క్లాస్ చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. బాలికతో పాటు ఆమె స్నేహితుడిని కూడా దుండగులు వేధించారు. శనివారం రాత్రి 7 గంటలకు జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు.. దుండగులను వెంటనే అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోచింగ్ క్లాస్ నుంచి బాలిక, ఆమె స్నేహితుడు తమ ఇళ్లకు వెళ్తుండగా నిందితులు అడ్డుకున్నారు. తర్వాత బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. ఆమెను అసభ్యంగా తాకారు. బాధితురాలు ఎంత ప్రాధేయపడినా వారు వదలలేదు. ఆమె తప్పించుకునేందుకు యత్నించగా.. ముఖానికి ముసుగు వేసుకున్న ఒకడు ఆమెను వెనుక నుంచి పట్టుకుని తీసుకెళ్లాడు. ఆమెను కాపాడేందుకు తన స్నేహితుడు ప్రయత్నించగా అతడిపైనా నిందితులు దాడి చేశారు. తర్వాత బాధితురాలిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకునిపోయారు.


నిందితులను శిక్షించాలి: రాహుల్ గాంధీ

ఈ చర్యను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. ‘తనను వేధించవద్దని చేతులు జోడించి ఆమె ప్రాధేయపడినా దుండగులు వినలేదు. ఆమెతో అలా ప్రవర్తించే హక్కు వారికి ఎరవిచ్చారు? ఇది మన కల్చర్ కాదు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి’ అని రాహుల్ ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. బిహార్ మంత్రి సునీల్ కుమార్ కూడా ఈ చర్యను ఖండించారు. బాలికను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.


Also Read:

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!

వైసీపీకి షాక్.. కీలక నేత రాజీనామా

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్కార్ గుడ్‌న్యూస్

Updated Date - Sep 21 , 2026 | 05:34 PM