నేడు ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్
ABN , Publish Date - Sep 14 , 2026 | 02:23 PM
తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ సోమవారం ఢిల్లీ పొలీసుల ఎదుట లొంగిపోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన సరెండర్ కానున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ సోమవారం ఢిల్లీ పొలీసుల ఎదుట లొంగిపోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన సరెండర్ కానున్నారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు 2013లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆయన్ను దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు గోవా బెంచ్ పదేళ్ల జైలుశిక్ష విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లొంగుబాటు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అప్పీల్‌ను విచారించాలంటే ముందుగా లొంగిపోవాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
కాగా.. 2013లో జూనియర్ సహోద్యోగినిపై అత్యాచారం చేసిన కేసులో తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. అయితే.. గతంలో ట్రయల్ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ఆ తీర్పును బాంబే హైకోర్టు రద్దు చేసింది. 2013లో గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో హోటల్ లిఫ్ట్‌లో తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. దీంతో అదే ఏడాది నవంబర్‌లో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణ అనంతరం 2021లో గోవా ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఆ తీర్పును గోవా ప్రభుత్వం.. బాంబే హైకోర్టులో సవాలు చేసింది. అప్పీల్‌ను విచారించిన హైకోర్టు.. ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించింది. పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఇవి కూడా చదవండి...
గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు.. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పోస్టు..
రేసింగ్ ట్రాక్‌పై విజయ్–అజిత్ ఆత్మీయ కలయిక.. టీవీకే రాజకీయ లాభం కోసమేనా?
Read Latest National News And Telugu News