Share News

తమిళనాడుపై 10 లక్షల కోట్ల అప్పుల భారం

ABN , Publish Date - May 11 , 2026 | 06:00 AM

తమిళనాడు పగ్గాలు చేపట్టిన మొదటిరోజే సీఎం విజయ్‌ గత డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ సైతం అంతే దీటుగా బదులిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి...

తమిళనాడుపై 10 లక్షల కోట్ల అప్పుల భారం

  • తొలి ప్రసంగంలోనే డీఎంకే సర్కారుపై విజయ్‌ ఫైర్‌

  • సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారు: మాజీ సీఎం స్టాలిన్‌

చెన్నై, మే 10 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు పగ్గాలు చేపట్టిన మొదటిరోజే సీఎం విజయ్‌ గత డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ సైతం అంతే దీటుగా బదులిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, గత ప్రభుత్వం ఖాళీ ఖజానాను అప్పగించడమే కాక సుమారు రూ.10 లక్షల కోట్లకు పైగా రుణభారం మోపిందని విజయ్‌ తన తొలి ప్రసంగంలో అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. ఖజానా ఖాళీగా ఉందని చెబితే.. తాను ఓ పార్టీనుద్దేశించి విమర్శలు చేస్తున్నట్లు భావించడం తగదని, వాస్తవమే చెబుతున్నానని తెలిపారు. ఏయే శాఖలు ఎంతటి అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయో పరిశీలించి.. త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. పరిస్థితి చక్కదిద్దడానికి తగిన అవకాశం ఇవ్వాలని, హామీలన్నిటినీ తప్పకుండా నెరవేరుస్తానని, అందుకు కాస్త గడువు ఇవ్వాలని ప్రజలను కోరారు. విజయ్‌ వ్యాఖ్యలపై స్టాలిన్‌ ‘ఎక్స్‌’లో తక్షణమే స్పందించారు. ఖజానాలో కావలసినంత డబ్బుందన్నారు. పరిమితికి లోబడే రుణాలు తెచ్చామన్నారు. విజయ్‌ మాటలు ఆయనకు ఓటేసిన ప్రజలను నిరాశపరుస్తాయన్నారు. సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి, ప్రజలను మోసం చేయడానికి ఆర్థిక నిర్వహణ సరిగా లేదంటూ విజయ్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 06:00 AM