Share News

తిరుచురాపల్లి ఈస్ట్ సీటుకు విజయ్ రాజీనామా

ABN , Publish Date - May 10 , 2026 | 05:45 PM

తిరుచురాపల్లి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం సీటుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదివారంనాడు రాజీనామా చేశారు. మంత్రులు కేఏ సెంగోట్టియన్, పి.వెంకటరమణన్‌లు లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీని కలిసి విజయ్ రాజీనామా లేఖను అందజేశారు.

తిరుచురాపల్లి ఈస్ట్ సీటుకు విజయ్ రాజీనామా
Vijay

చెన్నై: తిరుచురాపల్లి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం సీటుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదివారంనాడు రాజీనామా చేశారు. మంత్రులు కేఏ సెంగోట్టియన్, పి.వెంకటరణన్‌లు లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీని కలిసి విజయ్ రాజీనామా లేఖను అందజేశారు.


resign.jpg

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచురాపల్లి ఈస్ట్ అసెంబ్లీ సీట్లలో విజయ్ గెలిచారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం (ఆర్‌పీఏ)-1951 నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రెండు నియోజకవర్గాల్లోనూ గెలిస్తే ఒక సీటును వదులుకోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్‌ను వదిలి పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని విజయ్ నిర్ణయించారు. దీంతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి ఆరు నెలల్లోగా తిరిగి ఉప ఎన్నిక జరుగుతుంది.


ఇవి కూడా చదవండి..

రూ.10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి ఖజానా ఖాళీ చేశారు: విజయ్

సాకులు చెబితే కుదరదు.. సీఎం విజయ్‌పై స్టాలిన్ తొలి విమర్శ

Updated Date - May 10 , 2026 | 05:49 PM