Share News

రూ.10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి ఖజానా ఖాళీ చేశారు: విజయ్

ABN , Publish Date - May 10 , 2026 | 03:06 PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్ తొలి ప్రసంగంలోనే గత డీఎంకే ప్రభుత్వంపై విసుర్లు విసిరారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు రుణం మిగిల్చిందని, 2021-2026కు సంబంధించి తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.

రూ.10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి ఖజానా ఖాళీ చేశారు: విజయ్
Vijay

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్ (Vijay) తొలి ప్రసంగంలోనే గత డీఎంకే ప్రభుత్వంపై విసుర్లు విసిరారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు రుణం మిగిల్చిందని, 2021-2026కు సంబంధించి తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.


ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని, వారి రుణం తీర్చుకుంటానని జహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చేసిన ప్రసంగంలో విజయ్ అన్నారు. తాను రాయల్ ఫ్యామిలీ నుంచి రాలేదని, ఆకలి గురించి బాగా తెలుసునని అన్నారు. ప్రజలు పెద్దఎత్తున ఇచ్చిన సపోర్ట్ ముందు ఏ సవాలు తనకు పెద్దది కాదన్నారు. కొందరు తనను అవమానకరంగా మాట్లాడారని, అయితే వారు తన మిత్రులైనా, శత్రువులైనా ఎనిమిది కోట్ల మంది తన ప్రజలేనని చెప్పారు. విద్య, రోడ్లు, తాగునీటి సౌకర్యం, ఇతర నిత్యావసర సేవలపై తాను పూర్తి దృష్టి సారిస్తానని చెప్పారు. గతంలో చెప్పినట్టే తాను ప్రజా ధనాన్ని ఒక్క పైసా కూడా ముట్టనని, వృథా చేయనని స్పష్టం చేశారు.


కొంత సమయం ఇవ్వండి

ప్రభుత్వపరంగా సమీక్ష జరిపి శ్వేతపత్రాన్ని ప్రజల ముందు ఉంచుతానని, పారదర్శక పాలన అందిస్తానని విజయ్ చెప్పారు. తమిళనాడుకు సంబంధించిన ఎవరినైనా తాను కలవాలనుకుంటే ఓపెన్‌గానే కలుస్తానని, రహస్యాలేమీ ఉండవని చెప్పారు. తాను ఏ పనిచేసినా బహిరంగంగా, పారదర్శకంగానే చేస్తానని అన్నారు. తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని, అందుకు తగిన సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు. 'ఇది మీ ప్రభుత్వం. మహిళల భద్రతకు నేను భరోసాగా ఉంటాను. ఇవాల్టి నుంచి మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాను. డ్రగ్స్ బారి నుంచి యువతను కాపాడటం మా బాధ్యత. ప్రజల శాంతి భద్రతలకు భరోసా ఇస్తున్నాను' అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

సాకులు చెబితే కుదరదు.. సీఎం విజయ్‌పై స్టాలిన్ తొలి విమర్శ

ఇది మీ ప్రభుత్వం.. డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం: సీఎం విజయ్

Updated Date - May 10 , 2026 | 03:11 PM