షారుఖ్ కంటే.. స్వదేశ్ నటి గాయత్రి భర్త ఆస్తి విలువే ఎక్కువ..
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:29 PM
ఈ ఏడాది అత్యంత ధనవంతుల భారతీయుల జాబితాను హరూన్ ఇండియా ప్రకటించింది. ఈ జాబితాలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే, షారుఖ్ నటించిన స్వదేశ్ మూవీలో గాయత్రి ఒబెరాయ్ కూడా నటించారు. ఈమె భర్త వికాస్ నికర ఆస్తి విలువ రూ.48,100 కోట్లు అని హరూన్ తెలిపింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఈ ఏడాది అత్యంత ధనవంతుల భారతీయుల జాబితాను హరూన్ ఇండియా ప్రకటించింది. ఈ జాబితాలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. రూ.10 వేల కోట్ల నికర ఆస్తి విలువతో ఆయన ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అయితే, షారుఖ్ నటించిన స్వదేశ్ మూవీలో గాయత్రి ఒబెరాయ్ కూడా నటించారు. తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త వికాస్ ఒబెరాయ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వికాస్ నికర ఆస్తి విలువ రూ.48,100 కోట్లు అని హరూన్ తెలిపింది. అంటే షారుఖ్ నెట్‌వర్త్ కన్నా వికాస్ ఆస్తి విలువ దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. హరూన్ జాబితా ప్రకారం దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో వికాస్ 59లో స్థానంలో నిలిచారు. నిరుడు కూడా ఆయన రూ.42,960 కోట్లతో ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

స్వదేశ్ తర్వాత బాలీవుడ్‌కు గుడ్ బై..
గాయత్రి 1990లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తర్వాతి ఏడాది ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా 2000 సంవత్సరంలో మిస్ ఇంటర్నేషనల్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. 2004లో ఆమెకు బ్రేక్ దొరికింది. అశుతోష్ గోవారికర్ ఫిల్మ్స్ నిర్మించిన ‘స్వదేశ్’ చిత్రం ఆ ఏడాది విడుదలైంది. ఈ చిత్రంలో షారుఖ్ సరసన గాయత్రి కూడా నటించారు. ఆ చిత్రం తర్వాత వికాస్ ఒబెరాయ్‌ను గాయత్రి వివాహం చేసుకుని బాలీవుడ్ నుంచి వైదొలిగారు. ఆ టైంలో ఆమె వయసు 28 సంవత్సరాలే. పూర్తిగా కుటుంబానికి అంకితం కావడానికే సినిమాల నుంచి వైదొలిగినట్లు అప్పట్లో ఆమె తెలిపారు. కాగా.. స్వదేశ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ వార్తలూ చదవండి
సంఘ సంస్కరణలపై దృష్టి పెట్టండి
సార్.. నోరు తెరవండి.. డీఎంకే అధినేత స్టాలిన్‌పై సీఎం విజయ్ ఫైర్