మా సమయాన్ని వృథా చేయకండి.. వీడియోలు చూసే టైమ్ లేదు: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:53 PM
కాక్రోచ్ జనతాపార్టీ నిరసనకారుల విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
కాక్రోచ్ జనతాపార్టీ (CJP) నిరసనకారుల విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది నిరసన వీడియోల గురించి ప్రస్తావించగా.. 'మా సమయాన్ని వృథా చేయకండి' అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది (Supreme Court CJP protest).
నిరసనకారులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నిరసనకారులపై పోలీసుల చర్యకు సంబంధించిన వీడియోల గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించగా.. 'మాకు వీడియోలు చూసే సమయం లేదు' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు (CJI Surya Kant).
కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని, అలాగే పిటిషనర్ కూడా తన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. కాగా, అంతకు ముందు ఈ పిటిషన్ అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. ఈ అంశంలోకి తమను లాగొద్దని సూచించింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది (NEET protest).
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'చలో పార్లమెంట్' హింసాత్మకంగా మారింది. పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్‌కు దిగారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి..
2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..