Share News

ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ ఫౌండేషన్‌కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:21 AM

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది.

ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ ఫౌండేషన్‌కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Supreme Court

ఇంటర్నెట్ డెస్క్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందని వచ్చిన ఆరోపణలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) స్పందించింది. రూ.5 కోట్ల నష్టపరిహారం విధించింది (Supreme Court Art of Living).


ఎన్‌జీటీ విధించిన జరిమానాను రవిశంకర్ నేతృత్వంలోని ఫౌండేషన్ చెల్లించింది (Art of Living Rs 5 crore refund). అలాగే అదే సమయంలో న్యాయపోరాటం కూడా ప్రారంభించింది. దాదాపు పదేళ్ల పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు ఊరట లభించింది. ఫౌండేషన్ చెల్లించిన రూ.5 కోట్లను తిరిగి ఇవ్వాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది.


ఈ వార్తలనూ చదవండి:

టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు

Updated Date - Aug 22 , 2026 | 11:25 AM