ప్రశ్నించిన విద్యార్థులను శిక్షించడం సరికాదు
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:48 AM
భిన్నాభిప్రాయాలను కలిగిన విద్యార్థులను ప్రశ్నించారనే కారణంగా శిక్షించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. స్థిరపడిపోయిన విషయాలతో...
అలాంటి చర్యలు రాజ్యాంగానికి శోభను ఇవ్వవు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్యలు
న్యాయకోవిదులను జడ్జిలుగా నియమించాలని సూచన
న్యూఢిల్లీ, ఆగస్టు 30: భిన్నాభిప్రాయాలను కలిగిన విద్యార్థులను ప్రశ్నించారనే కారణంగా శిక్షించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. స్థిరపడిపోయిన విషయాలతో విభేదించడానికి, ప్రశ్నించడానికి తగిన వేదికగా యూనివర్సిటీలు ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులు స్వేచ్ఛగా ఆలోచించడం యూనివర్సిటీ స్థాయిలోనే ప్రారంభిస్తారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన నేషనల్ లా యూనివర్సిటీ పీజీ విద్యార్థుల 13వ స్నాతకోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. భిన్న దృక్పథాలు, విశ్వాసాలు కలిగిన స్వేచ్ఛా సమాజ నిర్మాణం రాజ్యాంగం లక్ష్యమని, ప్రజా జీవనంలో అసమ్మతికి చోటు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగ రక్షణను పొందే వాక్, భావ, భిన్నాభిప్రాయ స్వేచ్ఛను అసహన మనస్తత్వం నిరాకరిస్తుందని వివరించారు. ప్రముఖ న్యాయ కోవిదులను గుర్తించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని జస్టిస్ భుయాన్ సూచించారు. రాజ్యాంగంలోని 124 (3)(సి) దీనికోసమే ఉద్దేశించినా, గత 70 ఏళ్లుగా ఈ సంప్రదాయానికి దూరం కావడం విచారకరమన్నారు. ఇన్నాళ్లలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రాక్టీ్‌సలో ఉన్న న్యాయవాదులు తప్పించి, మరెవరూ సుప్రీంకోర్టు బెంచ్‌లను అలంకరించలేదని ఆయన గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News