సుప్రీంకోర్టు జడ్జీలుగా అయిదుగురి పేర్ల సిఫార్సు
ABN , Publish Date - May 29 , 2026 | 05:10 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి అయిదుగురు పేర్లను సిఫార్సు చేస్తూ కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో నలుగురు...
వీరిలో నలుగురు సీజేలు, ఒక మహిళా న్యాయవాది
న్యూఢిల్లీ, మే 28: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి అయిదుగురు పేర్లను సిఫార్సు చేస్తూ కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కాగా, మరొకరు సుప్రీంకోర్టులోని సీనియర్ మహిళా న్యాయవాది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 27 తేదీల్లో భేటీ అయిన కొలీజియం న్యాయమూర్తుల నియామకంపై చర్చలు జరిపింది. పంజాబ్-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ, జమ్మూ-కశ్మీర్- లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లిలకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న వి.మోహనను కూడా న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News