తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:35 AM
తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై ఈ నెల 24న కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ ఏడాదికి మాత్రమే వెలిగించేందుకు అనుమతి
చెన్నై, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై ఈ నెల 24న కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఇది కేవలం ఈ ఒక్కసారికి మాత్రమేనని స్పష్టం చేసింది. దీపం వెలిగించేందుకు దేవస్థానం ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే వెళ్లాలని సూచించింది. అవసరమైతే సీఆర్‌పీఎఫ్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కొండపై కార్తీక దీపాన్ని వెలిగించే సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి అనుమతి ఇస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తిరుప్పరంకుండ్రం కొండ దిగువన ఉన్న ఉచ్చిపిళ్లైయార్ ఆలయ సమపీంలోని దీపమండపం వద్ద దశాబ్దాలుగా ఈ దీపాన్ని వెలిగిస్తున్నారు. అయితే కొండపైన హజరత్ సుల్తాన్ సికిందర్ బాదుషా ఔలియా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న దీపస్థూపం (పురాతన రాతి దీపస్తంభం) వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు కోరాయి
ఇవి కూడా చదవండి..
ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్.. యువకుడిని కొట్టి చంపిన ఫ్యామిలీ
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..