Share News

సీటు రిజర్వ్ చేసుకునేందుకు ప్రయత్నం.. బస్సు కింద పడిన విద్యార్థిని.. వీడియో వైరల్..

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:24 PM

కర్ణాటకలోని తమకూరు దేవరాజ్ ఉర్స్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్‌లో జరిగిన ఒక భయంకరమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

 సీటు రిజర్వ్ చేసుకునేందుకు ప్రయత్నం.. బస్సు కింద పడిన విద్యార్థిని.. వీడియో వైరల్..
KSRTC Bus Accident

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని తమకూరు దేవరాజ్ ఉర్స్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్‌లో జరిగిన ఒక భయంకరమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఎప్పుడు జనాలతో రద్దీగా ఉండే బస్సులో సీట్లు దక్కించుకునేందుకు విద్యార్థులు ఎలా పోటీపడతారో ఈ ఘటన చూస్తే తెలుస్తోంది. కదులుతున్న కేఎస్ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద ఒక విద్యార్థిని కాలు నలిగిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.


తుమకూరు-పావగడ మార్గంలో ప్రయాణిస్తున్న ఒక కేఎస్ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరుతుండగా, విద్యార్థులు ఒక్కసారిగా బస్సుపైకి దూసుకువచ్చారు. అదే సమయానికి బస్సు మెల్లిగా కదలడంతో విద్యార్థిని వెనుక టైర్ కింద పడిపోయింది. దాంతో ఆమె కాలుకు గాయమై విలవిలలాడిపోయింది. వెంటనే విద్యార్థినిని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. దీనికి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్షతగాత్రుల వివరాలు విడుదల.. మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

శత వసంతాల వేళ.. శ్రీకోదండరామాలయంలో నవమి వేడుకలు

For More TG News And Telugu News

Updated Date - Mar 26 , 2026 | 02:29 PM