Share News

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..

ABN , Publish Date - Oct 25 , 2026 | 02:10 AM

రాజీవ్‌ గాంధీతో సోనియా గాంధీకి ఎలా పరిచయమైంది? ఆయన్ను ఆమె తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ కలిశారు? ఈ విషయాలను స్వయంగా సోనియానే వెల్లడించారు.

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..
soniagandhi

Sonia-Gandhi-2.jpg

  • తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..

  • మొదటిచూపులోనే జీవిత భాగస్వామి అని ఫిక్సయ్యా!

  • నా విషయంలో రాజీవ్‌ కూడా అలానే అనుకున్నారు

  • రాజీవ్‌ అందగాడు.. సౌమ్యుడు..

  • ఇంగ్లండ్‌ కేంబ్రిడ్జ్‌లోని ఓ గ్రీక్‌ రెస్టారెంట్‌లో ఆయనతో పరిచయం ఏర్పడింది

  • ప్రేమ చిగురించిందీ అప్పుడే.. ఎన్నో జ్ఞాపకాలతో

  • రాజీవ్‌తో నేను ఓ ప్రపంచాన్నే నిర్మించుకున్నాను

  • అదంతా మీ కోసం పుస్తకం రూపంలో..: సోనియా

  • 10న ఆత్మకథ ఆవిష్కరణ.. ఇన్‌స్టా, ఎక్స్‌లో పోస్టు

న్యూఢిల్లీ, అక్టోబరు 24: రాజీవ్‌ గాంధీతో సోనియా గాంధీకి ఎలా పరిచయమైంది? ఆయన్ను ఆమె తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ కలిశారు? ఈ విషయాలను స్వయంగా సోనియానే వెల్లడించారు. అంతేనా.. రాజీవ్‌ను ఫస్ట్‌టైమ్‌ చూసీ చూడగానే తన మనసులో పొంగిపొర్లిన భావాల పరంపరనూ ఆమె పంచుకున్నారు. రాజీవ్‌తో పరిచయమేర్పడిన 1965 సంవత్సరంలోకి వెళ్లిపోయి.. ‘‘ఆయన చాలా అందంగా ఉండేవారు’’ అంటూ కాస్త నవ్వు, ఆనంద చాయలు మిళితమైన వదనంతో యువతీయువకులుగా తమ తొలి పరిచయం నాటి మధుర జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘నేను తొలిసారిగా రాజీవ్‌ను చూసినప్పుడే నా జీవిత భాగస్వామి ఆయనేనన్న భావన నాకు కలిగింది. ఆ టైమ్‌లో ఆయన కూడా నా విషయంలో అలాగే అనుకున్నారని నాకు తెలిసింది.

ఆయనతో నా తొలిచూపులు, తొలిసారి మాటలు కలిసిన క్షణాలు ఎప్పుడూ తాజాగానే ఉంటాయి’’ అంటూ సోనియా నాటి జ్ఞాపకాల దొంతరలోకి వెళ్లిపోయారు. ‘‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’’ పేరుతో సోనియా గాందీ తన ఆత్మకథను అక్షరబద్ధం చేసిన సంగతి తెలిసిందే కదా! ఈ పుస్తకం నవంబరు 10న పాఠకులకు అందుబాటులోకి రానుంది. ఈ పుస్తకంలో ఇటలీలో తన బాల్య స్మృతులు, 18 ఏళ్ల యువతిగా ఉన్నప్పుడు రాజీవ్‌తో తొలిసారిగా కలిసిన మాటలు, ఆయనతో సాగిన ప్రేమ ప్రయాణం, అది పెళ్లి పీటలదాకా దారి తీసిన తీరు.. ఇలా అన్ని సంగతులను సోనియా గాంధీ 544 పేజీలతో కూడిన ఆత్మకథలో పంచుకున్నారు.


sonia1.jpgయువతిగా సోనియా గాంధీ ఇంగ్లండ్‌లో మంచి ఇటాలియన్‌ ఫుడ్డు కోసం చక్కని రెస్టారెంట్‌ కోసం వెతకడం ఆమెకు కోరుకున్న జీవిత భాగస్వామాని సంపాదించి పెట్టింది. రాజీవ్‌ వర్ఛస్సు మాత్రమే కాదు.. ఆయన మనసూ అందమైనదేనని సోనియా కొనియాడారు. స్టూడెంట్‌గా కేంబ్రిడ్జిలో గడిపిన రోజులనూ గుర్తుచేసుకున్నారు. కాగా మరో పదిహేను రోజుల్లో పుస్తకం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇన్‌స్టా వేదికగా సోనియా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఎక్స్‌లోనూ పోస్టు పెట్టారు. అప్పట్లో రాజీవ్‌తో కలిసి తాను దిగిన ఫొటోలనూ పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను రాజీవ్‌ను ఇంగ్లండ్‌లో మొదటిసారి కలిసిన ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు.


restarent.jpg’’కేంబ్రిడ్జ్‌లో ద వర్సిటీ పేరుతో ఓ గ్రీక్‌ రెస్టాంట్‌ ఉండేది. ఆ రోజుల్లో ఇంగ్లండ్‌లో మంచి ఫుడ్డు దొరికే అరుదైన రెస్టారెంట్లలో ఆ రెస్టారెంట్‌ ఒకటి. అక్కడ భోజనం చేసేందుకు భారత్‌, ఇటలీకి చెందిన విద్యార్థులు వచ్చేశారు. రాజీవ్‌, నేను తొలిసారిగా ఆ రెస్టారెంట్‌లోనే కలుసుకున్నాం. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా మాకు పరిచయమేర్పడింది. తర్వాత రాజీవ్‌, నేను చక్కని స్నేహితులమయ్యాం. రాజీవ్‌ చాలా సౌమ్యుడు. ఈ లక్షణం ఆయనలో తొలిచూపులోనే ప్రస్ఫుటంగా కనిపించింది.


sonia4.jpgఆ చిన్న గ్రీక్‌ రెస్టారెంట్‌లోనే మా ప్రేమ చిగురు తొడిగింది. ఇద్దరి మధ్య ప్రేమ, నవ్వులు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో రాజీవ్‌తో నేను ఓ ప్రపంచాన్నే సృష్టించుకున్నాను. ఆ జ్ఞాపకాలనే ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌ పుస్తకం ద్వారా మీతో పంచుకోబోతున్నాను’’ అని సోనియా చెప్పుకొచ్చారు. వీడియోలో.. పుస్తకం తొలికాపీని సోనియా అందుకొని కొన్ని పుటలు తిరగేశారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న కుమార్తె ప్రియాంకతో మిఠాయిలు పంచుకున్నారు. ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సోనియా తన ఆత్మకథలో ఇందిర, రాజీవ్‌లు హత్యకు గురైనప్పటి విషాద జ్ఞాపకాలు, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు, ఆ రంగంలో ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. ఇప్పటిదాకా సోనియాకు ఏ సామాజిక మాధ్యమంలోనూ ఖాతా లేదు. ఎక్స్‌లో, ఇన్‌స్టాలో ఆమెకు ఇదే తొలిపోస్టు కావడం గమనార్హం! పరస్పరం పరిచయమైన మూడేళ్లకు అంటే 1968లో సోనియా, రాజీవ్‌లకు వివాహమైంది

ఈ వార్తలు కూడా చదవండి ..

పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష

Updated Date - Oct 25 , 2026 | 02:13 AM