ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
ABN , Publish Date - Mar 31 , 2026 | 02:42 PM
ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆమె ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం.. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నెల 24న అస్వస్థత కారణంగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. వైద్యులు కొన్ని రోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు. చికిత్సకు ఆమె శరీరం సానుకూలంగా స్పందించడంతో ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది.
సోనియా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం.. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు, పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు