ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోయినా.. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ఎందుకు విరమించారు..
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:10 PM
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ నెరవేరకపోయినా తాను ఎందుకు నిరాహార దీక్ష విరమించాల్సి వచ్చిందో తాజాగా సోనమ్ వివరించారు.
దాదాపు 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఇటీవల కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్షను విరమించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ నెరవేరకపోయినా తాను ఎందుకు నిరాహార దీక్ష విరమించాల్సి వచ్చిందో తాజాగా సోనమ్ వివరించారు. ప్రభుత్వంతో ఎలాంటి రహస్య ఒప్పందమూ చేసుకోలేదని, నిరసనకారుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు (Sonam Wangchuk hunger strike).
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై హింసాత్మక చర్యలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన తనకు కలిగిందని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. గతంలో లడఖ్‌లో జరిగిన పోలీసు చర్యల మాదిరిగా పరిస్థితి మారకూడదనే ఉద్దేశంతో ఉపవాసాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అంశాలపై లిఖితపూర్వక హామీ లభించిందని ఆయన తెలిపారు (CJP protest Jantar Mantar).
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై ప్రతీకార చర్యలు ఉండవని, వారి సమస్యలపై చర్చ కొనసాగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వాంగ్‌చుక్ పేర్కొన్నారు (NEET protest). అయితే, దీక్ష విరమించడం అంటే ఉద్యమం ముగిసినట్లు కాదని స్పష్టం చేశారు. కాగా, జంతర్ మంతర్‌లో నిరసన చేపడుతున్న సీజేపీ నేతలు మాత్రం తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని వారు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..