కాక్రోచ్ నేతలకు రాజకీయ లక్ష్యాలున్నాయ్
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:51 AM
కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నాయకత్వంపై ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రంకాలకు...
ఉద్యమ కాలంలో అది నేను గ్రహించా
ఉద్యమాన్ని రాజకీయాలకతీతంగా నిర్వహించాలని దీప్కేను కోరేవాడిని
వాంగ్ చుక్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 30 : కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నాయకత్వంపై ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రంకాలకు స్పష్టమైన రాజకీయ ఆశయాలు ఉన్నాయి. జంతర్‌మంతర్ ఉద్యమం నడిచిన కాలంలో నేను ఈ విషయం గ్రహించాను. ఇందుకు వారిని నేను తప్పుబట్టను. అది తప్పు కూడా కాదు. రాజకీయ లక్ష్యాలు లేకుండా ఉండటానికి వారేమీ సాధువులు కాదు. దీప్కే వంటి నవ యువకులు మరింతగా రాజకీయాల్లోకి రావాలనే నేను కోరుకుంటా. అయితే, విద్యార్థి ఉద్యమాన్ని మాత్రం రాజకీయాలకు అతీతంగా నడిపించాలని అప్పట్లో నేను వారికి సూచించేవాడిని’’ అని వాంగ్‌చుక్ తెలిపారు. ఉద్యమ రోజులను ఆయన గుర్తుచేసుకుంటూ.. దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారని తనకు చెప్పినప్పుడు, రాజకీయ పార్టీలో ఉండటం తప్పు కాదని వారికి అప్పట్లో సమాధానం ఇచ్చానని తెలిపారు. అదే సమయంలో, ఉద్యమ వేదిక పవిత్రతను కాపాడాలని, బీజేపీ, ఆప్, కాంగ్రెస్ తదితర పార్టీల రంగును ఇక్కడ జనం కోరుకోరని నాయకత్వానికి తెలిపేవాడినని చెప్పారు. నాయకత్వం చివరివరకు తాను కోరుకున్నట్టే నడుచుకుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News