స్టార్ సింగర్ సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత..
ABN , Publish Date - Jun 01 , 2026 | 08:38 AM
ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ (89) ఆదివారం (మే 31) కన్నుమూశారు. వృద్ధాప్య కారణంగా ఆదివారం సాయంత్రం తన నివాసంలో మరణించారని ఆమె సన్నిహితులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ (89) కన్నుమూశారు. వృద్ధాప్య కారణంగా ఆదివారం(మే 31) సాయంత్రం తన నివాసంలో మరణించారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఆశా భోస్లే మరణించిన కొన్ని వారాలకే సుమన్ కళ్యాణ్‌పూర్ కూడా మరణించడంతో సంగీత ప్రియులు విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
బంగ్లాదేశ్ ఏర్పడక ముందు అవిభక్త భారతదేశంలోని ఢాకాలో సుమన్ 1937లో జన్మించారు. ఆమె బాల్యంలో ఉన్నప్పుడే.. వారి కుటుంబం ముంబైకి చేరుకుంది. సుమన్ కళ్యాణ్‌పూర్‌కు పెయింటింగ్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ, సంగీతం వైపు అడుగులు వేశారు. పండిట్ కేశవ్‌రావ్ భోలే, ఉస్తాద్ ఖాన్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ వంటి దిగ్గజాల వద్ద శిక్షణ పొందారు. 1954లో వచ్చిన ‘మంగు’ చిత్రంతో ఆమె సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె ‘నా నా కర్తే ప్యార్’, ‘ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే’, ‘నా తుమ్ హమే జానో’ వంటి ఎన్నో ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్స్ అందించారు.
హిందీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా భాషల్లో ఆమె వేలాది పాటలు పాడారు. కళారంగంలో ఆమె చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మ భూషణ్’ అవార్డుతో సత్కరించింది. ఆమె మరణం పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 'భారతీయ సంగీత ప్రపంచంలో ఓ గొప్ప స్వరం శాశ్వతంగా మూగబోయింది' అని ఎక్స్ వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి:
నర్మదా-క్షిప్రా పైప్‌లైన్ లీక్ కావడంతో భారీ విధ్వంసం..
బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం