Share News

బాలుడి తల్లి పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం.. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి..

ABN , Publish Date - Jun 01 , 2026 | 08:03 AM

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న బాలుడి హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుడి తల్లి తనతో పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతోనే నిందితుడు విరాజ్ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

బాలుడి తల్లి పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం.. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి..
Firozabad viral video

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న బాలుడి హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుడి తల్లి తనతో పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతోనే నిందితుడు విరాజ్ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. రతి, సుమిత్ భార్యాభర్తలు. వీరికి ఒకటిన్నరేళ్ల బాబు ఉన్నాడు. ఆ బాలుడి పేరు ఆరవ్. రతి బంధువుల ఊరికి చెందిన విరాజ్ అనే యువకుడు గత కొంతకాలం నుంచి ఆమెను ప్రేమిస్తున్నాడు. రతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.


కొన్ని రోజుల క్రితం రతి దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. విరాజ్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో విరాజ్ రాక్షసుడిలా మారిపోయాడు. రతి తనను పెళ్లి చేసుకోవడానికి బాలుడు అడ్డంగా ఉన్నాడని భావించాడు. బాలుడు లేకపోతే తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని, ఎలాగైనా బాలుడి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. రెండు రోజుల క్రితం రతి బంధువు ఇంటికి వచ్చింది. ఈ విషయం విరాజ్‌కు తెలిసింది. వెంటనే రతి బంధువు ఇంటికి వెళ్లాడు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి బాలుడిని బయటకు తీసుకెళ్లాడు.


తర్వాత అతి దారుణంగా హత్య చేసి చంపాడు. బాలుడిని చంపిన తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. చలనం లేకుండా నేలపై పడున్న బాలుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు తేల్చారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసు బృందాలు విరాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు మెయిన్‌పురి రోడ్డులో వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి విరాజ్‌ను చుట్టుముట్టారు.


పోలీసుల నుంచి తప్పించుకోవడానికి విరాజ్ తుపాకితో కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. విరాజ్ కాలికి బుల్లెట్లు తగిలి కుప్పకూలాడు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో విరాజ్ చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. విరాజ్, రతికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదన్న దానిపై దృష్టి సారించారు.


ఇవి కూడా చదవండి

నర్మదా-క్షిప్రా పైప్‌లైన్ లీక్ కావడంతో భారీ విధ్వంసం..

బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం

Updated Date - Jun 01 , 2026 | 08:27 AM