యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:21 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి, వారాంతపు సెలవు దినం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో...
దర్శించుకున్న లక్షమందికిపైగా భక్తులు
నిత్యాదాయం రూ.81.77లక్షలు
యాదగిరిగుట్ట, మే 31(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి, వారాంతపు సెలవు దినం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 1,01,000మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనానికి గంట, ధర్మదర్శనానికి 2గంటల సమయం పట్టింది. ప్రధానాలయం, శివాలయం మెట్ల దారి, ప్రసాద విక్రయశాల, ఆలయ పశ్చిమ, ఉత్తర తిరువీధులు భక్తులతో నిండిపోయాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.81,77,104 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో జే.భవానీశంకర్ తెలిపారు.