Ambernath Muncipal Council: బీజేపీకి ఝలక్.. శివసేనకు మద్దతిచ్చిన ఎన్‌సీపీ కౌన్సిలర్లు
ABN , Publish Date - Jan 09 , 2026 | 09:21 PM
అంబెర్‌నాథ్‌లో స్థానిక ఎన్‌సీపీ నేతలు కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేశారు. 2023 నుంచి తాము కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూనే ఉన్నచ్చు పలువురు నేతలు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు.
ముంబై: భారతీయ జనతా పార్టీ (BJP)కి అంబెర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ (NCP)కి చెందిన నలుగురు కౌన్సిలర్లు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకు మద్దతిచ్చేందుకు నిర్ణయించారు. అంబెర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో శివసేనను అధికారంలో రాకుండా కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలిపిందన్న వార్తలు ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ రెండు పార్టీలు ఈ వార్తల్ని ఖండించాయి.
అంబెర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో 60 మంది కౌన్సిలర్లు ఉన్నారు. శివసేనకు 27 మంది కౌన్సిలర్లు ఉండగా, బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు 12 మంది, ఎన్‌సీపీకి నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పుడు 27 మంది శివసేన కౌన్సిలర్లకు నలుగురు ఎన్‌సీపీ కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్ మద్దతు ప్రకటించారు. దీంతో శివసేన బలం 32కు చేరింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అంబెర్‌నాథ్‌లో స్థానిక ఎన్‌సీపీ నేతలు కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేశారు. 2023 నుంచి తాము కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూనే ఉన్నట్టు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. దీంతో శివసేనకు మద్దతు ఇవ్వాలని ఎన్‌సీపీ నిర్ణయం తీసుకుంది. మహాయుతి కూటమిలో బీజేపీ, ఎన్‌సీపీ, షిండే శివసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ అంబెర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మాత్రం మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి.
ఇవి కూడా చదవండి..
28 నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ
ఐప్యాక్ దాడులకు నిరసనగా మమత భారీ ప్రదర్శన... సీజేఐను ఆశ్రయించిన ఈడీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి