Share News

భారత్‌లో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమైన భాగం.. ఒమర్‌ అబ్దుల్లాతో అమెరికా రాయబారి భేటీ..

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:13 PM

జమ్మూకశ్మీర్‌ అంశంపై అమెరికా నుంచి కీలక వ్యాఖ్య వెలువడింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ బుధవారం శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో సమావేశమయ్యారు.

భారత్‌లో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమైన భాగం.. ఒమర్‌ అబ్దుల్లాతో అమెరికా రాయబారి భేటీ..
Sergio Gor, Omar Abdullah

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌ అంశంపై అమెరికా నుంచి కీలక వ్యాఖ్య వెలువడింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ బుధవారం శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అనంతరం 'జమ్మూకశ్మీర్‌ భారత్‌లో ఒక ముఖ్యమైన భాగం' అని వ్యాఖ్యానించారు. అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెర్గియో గోర్‌ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి (Sergio Gor in JK).


ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అమెరికా రాయబారి శ్రీనగర్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌ను భారత్‌లోని ముఖ్యమైన భాగంగా అమెరికా రాయబారి బహిరంగంగా పేర్కొనడం ప్రాధాన్యం కలిగిన పరిణామం అని చెప్పాలి. జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌ తన వాదనను కొనసాగిస్తున్న సమయంలో భారత్‌ వైఖరికి అనుకూలంగా అమెరికా రాయబారి మాట్లాడడం అత్యంత కీలకంగా నిలవనుంది ( J&K Important Part of India).


కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జమ్మూకశ్మీర్‌తో పాటు లద్దాఖ్‌లోనూ పర్యటించనున్నారు. శ్రీనగర్‌లో ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను కలిశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌, అమెరికా మధ్య సంబంధాలను మరింత విస్తరించే అవకాశాలపై చర్చ జరిగినట్లు ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. అంతకుముందు ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన అంతర్గత సమస్యలను అమెరికా రాయబారి వద్ద ప్రస్తావించబోనని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ సమస్యలను పరిష్కరించాల్సింది న్యూఢిల్లీ అని, వాషింగ్టన్‌ కాదని ఆయన పేర్కొన్నారు (India US Relations).


జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన అమెరికా ప్రయాణ హెచ్చరికను కూడా సమీక్షించే అవకాశం ఉందని సెర్గియో గోర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా తన పౌరులకు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, పౌర అశాంతి వంటి కారణాలతో ప్రయాణంపై హెచ్చరికలు జారీ చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..


పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

Updated Date - Aug 19 , 2026 | 06:15 PM