ఒకే కుటుంబం.. మూడు పార్టీలు.. మూడు విజయాలు.. లాటరీ అంటే ఇదే..
ABN , Publish Date - May 05 , 2026 | 01:50 PM
తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబం తాజా ఎన్నికలలో అద్భుతం చేసింది. మార్టిన్ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, మూడు పార్టీల తరఫున పోటీ చేసి, గెలుపొందారు.
తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబం తాజా ఎన్నికలలో అద్భుతం చేసింది. మార్టిన్ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, మూడు పార్టీల తరఫున పోటీ చేసి, గెలుపొందారు. తమిళనాడు నుంచి ఇద్దరు, పుదుచ్చేరి నుంచి మరొకరు విజయం సాధించారు (Santiago Martin family).
మార్టిన్ భార్య లీమారోస్ మార్టిన్ అన్నాడీఎంకే తరఫున లాల్‌గుడి నియోజకర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. డీఎంకేకు కంచుకోట అయిన లాల్‌గుడి నియోజకవర్గంలో ఐదు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో లీమారోస్ గెలుపొందారు. ఇక, మార్టిన్ అల్లుడు అర్జున, టీవీకే తరఫున విక్కివక్కం నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. 17 వేల ఓట్ల ఆధిక్యంతో డీఎంకే అభ్యర్థిపై గెలుపొందారు. అలాగే, మార్టిన్ కొడుకు జోస్ మార్టిన్ పుదుచ్చేరి ఎన్నికల బరిలో దిగారు. ఎల్‌జేకే పార్టీ అధినేత అయిన జోస్, కామ్‌రాజ్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు (Lottery king India).
1988లో తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలు పెట్టిన శాంటియాగో ఆ తర్వాత కేరళ, కర్ణాటకకు విస్తరించారు (Tamil Nadu election 2026 news). ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు మకాం మార్చారు. అక్కడి నుంచి నేపాల్, భూటాన్‌లో కూడా తన బిజినెస్ మొదలుపెట్టారు. శాంటియాగోకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ సోల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రపంచ లాటరీ అసోయేషన్‌లో కూడా సభ్యత్వం ఉంది. కాగా, శాంటియాగో వేల కోట్ల సామ్రాజ్యం వెనుక ఎన్నో ఆర్థిక మోసాలున్నాయని ఈడీ ఆరోపించింది. గతంలో శాంటియాగో కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించింది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..
కమల్ హాసన్, రజనీకాంత్‌కు సాధ్యం కానిది.. విజయ్‌కు ఎలా సాధ్యమైంది?