పనిమనిషి స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు.. బెంగాల్ ఎన్నికల్లో సంచలనం
ABN , Publish Date - May 05 , 2026 | 12:15 PM
పశ్చిమ బెంగాల్‌కు చెందిన కలితా మాఝి కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పనిమనిషిగా ఉన్న ఆమె, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగి గెలిచారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన కలితా మాఝి కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పనిమనిషిగా ఉన్న ఆమె, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఆమె టీఎంసీ అభ్యర్థిపై 12,535 ఓట్ల తేడాతో గెలుపొందారు. సుమారు 1.07 లక్షల ఓట్లు సాధించారు (Kalita Majhi BJP).
రాజకీయాల్లోకి రాకముందు కలితా.. పలు ఇళ్లలో పనిమనిషిగా చేశారు. నెలకు రూ.2,500 వరకు సంపాదించేవారు. ఆమెకు ఎలాంటి ఆస్తులూ లేవు. 2021లో బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడంతో అసెంబ్లీి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే టీఎంసీకి చెందిన అభేదానంద థాండర్ చేతిలో ఓడిపోయారు. అయితే.. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆమెకు మరో అవకాశం కల్పించింది. ఐదేళ్ల క్రితం ఓడిపోయినప్పటికీ స్థానికులతో ఆ అనుబంధాన్ని కొనసాగించారు కలితా. అలా ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు (Ausgram election result 2026).
సాధారణ వ్యక్తులు కూడా ఎన్నికల్లో గెలుపొందవచ్చని కలితా విజయం నిరూపిస్తోంది(Bengal election news). భారత ప్రజాస్వామ్యంలో అవకాశాలు అందరికీ ఉన్నాయని చాటి చెబుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాల్లో గెలిచి భారీ విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది. మే 9వ తేదీన బీజేపీ తరఫున కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..
కమల్ హాసన్, రజనీకాంత్‌కు సాధ్యం కానిది.. విజయ్‌కు ఎలా సాధ్యమైంది?