గణపతి పూజలో పాల్గొన్న సల్మాన్ ఖాన్
ABN , Publish Date - Sep 15 , 2026 | 02:47 PM
ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసంలో జరిగిన గణపతి పూజలో బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. పూజారి ఆయనకు అంగవస్త్రం ధరింపజేసిన అనంతరం.. సల్మాన్ వినాయకుడికి పూలు సమర్పించి నమస్కరించుకున్నారు.
ముంబై, సెప్టెంబర్ 15: మహారాష్ట్ర ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసంలో జరిగిన గణపతి పూజలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. పూజారి ఆయనకు అంగవస్త్రం ధరింపజేసిన అనంతరం.. సల్మాన్ వినాయకుడికి పూలు సమర్పించి నమస్కరించుకున్నారు.
నుదుటన తిలకంతో, సంప్రదాయ పద్ధతిలో పూజలో పాల్గొన్న సల్మాన్ వీడియో నెట్టింట వైరల్ కాగా.. 'లౌకికత్వానికి (Secularism) నిదర్శనం' అని ఆయన అభిమానులు ప్రశంసించారు.
రక్షా బంధన్ వేడుకలు: దీనికి ముందే తన సోదరి అర్సితా ఖాన్ శర్మ నివాసంలో సల్మాన్ రాఖీ పండుగ నిర్వహించుకున్న వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియోలో వెనుక భాగంలో ఏసు క్రీస్తు చిత్రం ఉండటం, సల్మాన్ చేతికి రంగురంగుల రాఖీలు ధరించడం గమనించిన జనాలు ఆయన లౌకిక దృక్పథాన్ని మెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆసియా కప్: భారత పేసర్‌కు షాక్.. జరిమానా విధించిన ఐసీసీ
ట్రోఫీకి బదులు వాటర్ బాటిల్.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఫన్నీ సెలబ్రేషన్స్ వైరల్