Share News

సముద్ర పరిశోధనలకు సరికొత్త శక్తి

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:59 AM

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సముద్ర పరిశోధన నౌక ‘సాగర్‌ మంథన్‌’ను గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ (జీఆర్‌ఎ్‌సఈ) బుధవారం కోల్‌కతాలోని రిషి బంకిం షిప్‌యార్డ్‌లో...

సముద్ర పరిశోధనలకు సరికొత్త శక్తి

కోల్‌కతాలో ‘సాగర్‌ మంథన్‌’ నౌక ప్రారంభం

కోల్‌కతా, సెప్టెంబరు 9: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సముద్ర పరిశోధన నౌక ‘సాగర్‌ మంథన్‌’ను గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ (జీఆర్‌ఎ్‌సఈ) బుధవారం కోల్‌కతాలోని రిషి బంకిం షిప్‌యార్డ్‌లో ప్రారంభించింది. సముద్ర లోతుల్లో అన్వేషణకు, శాస్త్రీయ పరిశోధనలకు ఈ నౌక ఊతమిస్తుంది. రూ.840 కోట్లతో తయారైన ఈ పరిశోధన నౌక 2028లో పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని భావిస్తున్నారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషన్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీపీఓఆర్‌) కోసం ఈ నౌకను నిర్మించారు. డీప్‌ ఓషన్‌ మిషన్‌లో భాగంగా ఈ నౌకను నిర్మించినట్లు కేంద్ర భూ విజ్ఞాన మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతం, దానికి అవతల కూడా మన శాస్త్రీయ పరిశోధనల సామర్థ్యాన్ని ఇది పెంచుతుందని అన్నారు. భూమధ్య రేఖ ప్రాంతంలోని హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంతో పాటు అంటార్కిటికా జలాల్లో పరిశోధనలు చేయగలిగే సామర్థ్యం ఈ నౌక సొంతం. భారీ అలలు, తీవ్రమైన సముద్ర పరిస్థితుల్లో కూడా ఇది సాఫీగా ప్రయాణిస్తుంది. తీర ప్రాంతాలతో పాటు 6 కిలోమీటర్ల లోతైన సముద్ర గర్భంలో భూభౌతిక భూకంప సర్వేలు చేయడం, కదులుతూనే సముద్ర అడుగును స్కాన్‌ చేసి మ్యాపింగ్‌ చేసే సామర్థ్యం కలిగి ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు

హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 06:00 AM