Share News

రష్యా సైన్యంలో చేరొద్దు: భారతీయులకు కేంద్రం హెచ్చరిక

ABN , Publish Date - Sep 30 , 2026 | 09:31 PM

రష్యా సాయుధ దళాల్లో చేరాలని వస్తున్న ఆఫర్ల పట్ల భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి హెచ్చరించింది. డబ్బుపై ఆశతో రష్యా సైన్యంలో చేరి, ఆ తర్వాత భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని బయటకు తీసుకొస్తుందని భావించవద్దని స్పష్టం చేసింది.

రష్యా సైన్యంలో చేరొద్దు: భారతీయులకు కేంద్రం హెచ్చరిక
MEA spokesperson Randhir Jaiswal

ఇంటర్నెట్ డెస్క్: రష్యా సాయుధ దళాల్లో చేరాలని వస్తున్న ఆఫర్ల పట్ల భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మరోసారి హెచ్చరించింది. డబ్బుపై ఆశతో రష్యా సైన్యంలో చేరి, ఆ తర్వాత భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని బయటకు తీసుకొస్తుందని భావించవద్దని స్పష్టం చేసింది. ఇలాంటి విధానాలను భారత ప్రభుత్వం ప్రోత్సహించదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు (Russia Army recruitment).


రష్యా సాయుధ దళాల్లో భారతీయుల నియామకానికి సంబంధించిన వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయని ఎంఈఏ తెలిపింది. ఇలాంటి నియామకాల వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి భారత ప్రభుత్వం గత రెండేళ్లుగా హెచ్చరిస్తోందని, అయినప్పటికీ కొందరు వ్యక్తులు ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితులవుతున్నారని పేర్కొంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే సమయంలో తెలియని వ్యక్తులు, ధ్రువీకరణ లేని ఏజెంట్లు ఇచ్చే ఆఫర్లను నమ్మవద్దని భారతీయులకు సూచించింది (MEA warning Indians).


కొంతమంది భారతీయులు రష్యా పాస్‌పోర్టు పొందేందుకు ముందుగా తమ భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకునేందుకు కూడా ప్రయత్నించినట్లు ఎంఈఏ తెలిపింది (Indian nationals Russian army). తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం భారత అధికారులను సంప్రదించకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. రష్యాలో ఉద్యోగం పేరుతో వచ్చే ఆఫర్లను అంగీకరించే ముందు పూర్తిగా పరిశీలించాలని ఎంఈఏ సూచించింది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద నమోదుకాని ఏజెంట్ల ద్వారా వచ్చే ఆఫర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్.. సీఈసీపై ఇండియా కూటమి నిరసనలు..


రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల కిందకు.. దుబాయ్‌-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..

Updated Date - Sep 30 , 2026 | 09:36 PM