Share News

ప్రధాని విదేశీ పర్యటనలు.. ఖర్చు చేసిన ఒక్కో రూపాయికి రూ.66 వేల పెట్టుబడులు..

ABN , Publish Date - Aug 06 , 2026 | 09:09 PM

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను తాజాగా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై మొత్తం రూ.482.92 కోట్లు ఖర్చు అయ్యాయి.

ప్రధాని విదేశీ పర్యటనలు.. ఖర్చు చేసిన ఒక్కో రూపాయికి రూ.66 వేల పెట్టుబడులు..
PM Modi Foreign Visits

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను తాజాగా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై మొత్తం రూ.482.92 కోట్లు ఖర్చు అయ్యాయి. అదే సమయంలో భారత్‌కు 381.8 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చాయి. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.31.69 లక్షల కోట్లు (PM Modi Foreign Visits).


ప్రధాని విదేశీ పర్యటనలపై ఖర్చు చేసిన ఒక్కో రూపాయికి సుమారు రూ.66 వేలు విలువైన ఎఫ్‌డీఐలు భారత్‌కు వచ్చినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2021 నుంచి ఇప్పటివరకు ఏయే దేశాల్లో పర్యటించారు? ఒక్కో దేశ పర్యటనకు అయిన ఖర్చు ఎంత? తదితర వివరాల గురించి రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు విదేశాంగశాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా సమాధానం ఇచ్చారు (Narendra Modi FDI India).


మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాని 2021లో చేసిన మూడు విదేశీ పర్యటనలకు రూ.36.12 కోట్లు ఖర్చు కాగా, 2022లో ఏడు పర్యటనలకు రూ.55.83 కోట్లు ఖర్చయింది. ఇక, 2023లో ఆరు పర్యటనలకు రూ.93.63 కోట్లు, 2024లో 11 పర్యటనలకు రూ.109.51 కోట్లు, 2025లో 11 పర్యటనలకు రూ.187.83 కోట్లు ఖర్చుయ్యాయి. ఇక, 2026లో ఇప్పటివరకు ఆరు పర్యటనలపై రూ.74.59 కోట్ల వ్యయం అయినట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..


హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..

Updated Date - Aug 06 , 2026 | 09:09 PM