Share News

అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం..

ABN , Publish Date - Aug 06 , 2026 | 08:21 PM

భారత్ మరో కీలక క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.

అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Agni-4 Missile

భారత్ మరో కీలక క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం (ఆగస్టు 6) వెల్లడించింది (Agni-4 Missile).


ఈ ప్రయోగాన్ని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించారు (India Missile Test). పరీక్ష సందర్భంగా క్షిపణికి సంబంధించిన అన్ని ఆపరేషనల్, సాంకేతిక ప్రమాణాలను విజయవంతంగా అందుకున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అగ్ని శ్రేణి క్షిపణులు భారత వ్యూహాత్మక రక్షణ సామర్థ్యంలో కీలకమైనవి. అగ్ని-4 సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి.


ఇవి కూడా చదవండి..

అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..


హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..

Updated Date - Aug 06 , 2026 | 08:23 PM