భార్యను గొంతునులిమి హత్య.. ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి అరెస్టు
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:16 PM
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ ఉద్యోగి ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని తమ అపార్ట్‌మెంట్‌లో భార్యను గొంతునులిపి హత్య చేశారనే కారణంగా ఈ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ ఉద్యోగి ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని తమ అపార్ట్‌మెంట్‌లో భార్యను గొంతునులిపి హత్య చేశారనే కారణంగా ఈ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడుని 65 ఏళ్ల నాగేశ్వరరావుగా గుర్తించారు. అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బొమ్మెలహల్లి ఏరియాలో ఉంటున్న నాగేశ్వరరావు తన భార్య సంధ్యశ్రీని టవలుతో గొంతు నులిమి హత్య చేశారని, ఘటనా స్థలిలోనే ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, నిందితుడు తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్నారని, చికిత్స కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. మొదట తన భార్యను చంపి తాను కూడా చనిపోవాలని ఆయన ప్లాన్ చేశారని, ప్రస్తుతానికి వేరే ప్రధాన కారణమేదీ కనిపించడం లేదని డీసీపీ (వైట్‌ఫీల్డ్) సైదులు తెలిపారు. హత్య అనంతరం నిందితుడు అపార్ట్‌మెంట్ నుంచే ఆ సమాచారాన్ని తెలిసిన వ్యక్తికి చెప్పడంతో పోలీసులకు సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది. అవలహళ్లి పోలీసు బృందం ఘటనా స్థలికి చేరుకుని సంధ్యశ్రీ హత్యను ధ్రువీకరించింది. రావును కస్టడీలోకి తీసుకుంది. కాగా, ఈ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. అమెరికాలో ఉంటున్న ఆమెకు పోలీసులు సమాచారం తెలియజేశారు. ఈ ఘటనను హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదం రోజే 75 ఫైళ్ల క్లియరెన్స్‌పై వివాదం
జాతీయ భద్రతకు రాహుల్ ప్రమాదకారి.. రిజిజు సంచలన వ్యాఖ్యలు