బీజేపీలో ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ గ్రీన్ సిగ్నల్..
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:54 PM
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ విలీనంతో బీజేపీ సంఖ్యాబలం 113కి పెరిగింది. ఆప్ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గింది (AAP MPs merger BJP).
ఆప్ నుంచి రాఘవ్ చద్దా, సాందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతీ మాలివాల్ సహా ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించారు. వీరి విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం తెలపడంతో వారంతా బీజేపీ సభ్యులయ్యారు. విలీనం తర్వాత తమను బీజేపీ ఎంపీలుగానే పరిగణించాలని కోరుతూ ఈ ఏడుగురూ రాజ్యసభ ఛైర్మన్‌కు వినతి పత్రం సమర్పించారు. దానికి తాజాగా ఆమోదం లభించింది (Raghav Chadha BJP).
కాగా, తమ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆప్ ఆదివారం రాజ్యసభ ఛైర్మన్‌కు వినతిపత్రం సమర్పించింది (BJP Rajya Sabha strength). కేంద్ర సంస్థలను ఉపయోగించి తమ నాయకులను ఒత్తిడి చేసి బీజేపీలోకి చేర్చుకున్నారని ఆరోపించింది. ఈ అంశంపై చట్టపరమైన పోరాటం కూడా కొనసాగుతుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి.. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ..
న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..