సీఐసీగా గోయల్ ఎంపికపై రాహుల్ అసమ్మతి!
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:49 AM
కేంద్ర నూతన ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా రాజ్‌కుమార్ గోయల్ నియామకాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విభేదించినట్లు ఓ ఆర్టీఐ సమాధానం...
ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన భేటీలో మరో ముగ్గురి పేర్లు ప్రతిపాదన..ఆర్టీఐ సమాధానంలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కేంద్ర నూతన ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా రాజ్‌కుమార్ గోయల్ నియామకాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విభేదించినట్లు ఓ ఆర్టీఐ సమాధానం వెల్లడించింది. సీఐసీ పదవికి ఆయన ఐఏఎస్ సుమితా దావ్రా, జస్టిస్ ఎస్.మురళీధర్, ప్రొఫెసర్ ఫైజన్ ముస్తాఫా పేర్లను ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగం సమాచార హక్కు కార్యకర్త లోకేశ్ బాత్రాకు ఆర్టీఐ సమాధానంగా గతేడాది డిసెంబరు 10న జరిగిన సమావేశ మినిట్స్ వివరాలను ఇచ్చింది. సీఐసీతో పాటు ఇతర ఎనిమిది మంది సమాచార కమిషన్లను ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆ రోజున పార్లమెంట్ భవనంలో సమావేశమైంది. ఈ భేటీకి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు సభ్యుల హోదాలో హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఐసీగా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ గోయల్ పేరును అమిత్‌షా ప్రతిపాదించగా, దానిపై విభేదించిన రాహుల్ గాంఽధీ.. మరో ఇతర మూడు పేర్లను సూచించినట్లు భేటీ మినిట్స్ వివరాలు చెబుతున్నాయి. కేంద్ర కార్మిక శాఖ మాజీ కార్యదర్శి సుమితా దావ్రా (రిటైర్డ్), ఒడిశా హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎస్.మురళీధర్, నల్సార్ మాజీ వైస్ చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫాలకు వారి రంగాల్లో విశేష అనుభవం ఉందని, వారిలో ఒకరిని ఎంపిక చేయాలని రాహుల్ గాంధీ రాతపూర్వకంగా తన ప్రతిపాదనలను సమర్పించినట్లు ఆర్టీఐ సమాధానం పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం రాజ్‌కుమార్ గోయల్‌నే సీఐసీగా నియమిస్తూ డిసెంబరు 15న ప్రకటన చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News