Share News

వీళ్లకు స్టూడెంట్స్ వద్దు.. అంధ భక్తులే కావాలి: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Sep 19 , 2026 | 08:00 PM

ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థ విద్యార్థుల ఆలోచనా విధానాన్ని భయపడుతోందని, ప్రశ్నించే తత్వాన్ని అణచివేయాలని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన 'విద్యార్థుల గళం' కార్యక్రమంలో రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

వీళ్లకు స్టూడెంట్స్ వద్దు.. అంధ భక్తులే కావాలి: రాహుల్ గాంధీ
Rahul Gandhi in Indore: ‘System Needs Blind Followers, Not Students’

ఇండోర్, సెప్టెంబర్ 19: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన 'ఛాత్రోంకీ గూంజ్' (విద్యార్థుల గళం) కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థ విద్యార్థుల ఆలోచనా విధానాన్ని భయపడుతోందని, ప్రశ్నించే తత్వాన్ని అణచివేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.


విద్యార్థి ఎల్లప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలని, ప్రశ్నించాలని కోరుకుంటాడు. అందుకే వ్యవస్థకు విద్యార్థులంటే భయం. వ్యవస్థకు ప్రశ్నించే విద్యార్థులు వద్దు, చెప్పినదల్లా గుడ్డిగా నమ్మే 'అంధభక్తులే' కావాలని రాహుల్ విమర్శించారు.


న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు తమ పనితీరును ఎందుకు సరిగ్గా నిర్వహించడం లేదో విద్యార్థులే ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీక్‌లు, విద్యాసంస్థల దుస్థితి, నిరుద్యోగంపై యువత గళం విప్పాలని రాహుల్ పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు కూడా వేదికపై తమ సమస్యలను పంచుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల లేమి, ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, పేపర్ లీకేజీలు, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారంటూ విద్యార్థులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చారు.


యువత ఎప్పుడూ భయపడకుండా ప్రశ్నలు అడుగుతూ తమ హక్కుల కోసం గొంతు విప్పాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.


ఇవి కూడా చదవండి...

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

హఫీజ్‌పేట్ ఘటన.. హోంగార్డ్ ఆనంద్‌పై వేటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 08:35 PM